తెలంగాణలో న్యాయ వ్యవస్థ లాక్‌డౌన్ పొడిగింపు

తెలంగాణ రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ లాక్ డౌన్‌ను జూన్ 6 వరకు పొడిగింపు చేశారు.

Sumitra
Published on: 30 May 2020 10:03 AM IST
తెలంగాణలో న్యాయ వ్యవస్థ లాక్‌డౌన్ పొడిగింపు
X

తెలంగాణ రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ లాక్ డౌన్‌ను జూన్ 6 వరకు పొడిగింపు చేశారు. కోర్టులు, ట్రైబ్యునళ్ల లాక్ డౌన్‌ను జూన్ 6 వరకు పొడిగించినట్లుగా హైకోర్టు పేర్కొంది. ఈ మేరకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అత్యవసర కేసులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టాలని జిల్లా కోర్టులకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి, హైదరాబాద్, మినహా ఇతర జిల్లాల్లో ఆన్ లైన్‌తో పాటు నేరుగా పిటిషన్ల దాఖలుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది.

ఈ నేపథ్యంలోనే ప్రతి కోర్ట్ లో కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. అందులో భగంగానే కోర్టుల్లో శానిటైజేషన్, మాస్కులు వాడాలని, బయటికి వెళ్ళిన వారు సామాజిక దూరం పాటించాలని సూచించింది.

Sumitra

Sumitra

Next Story