జూబ్లీహిల్స్‌ బోగస్‌ ఓట్లపై హైకోర్టులో ముగిసిన విచారణ

జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో బోగస్‌ ఓట్ల నమోదుపై హైకోర్టులో విచారణ జరిగింది.

Arun Chilukuri
Published on: 16 Oct 2025 5:41 PM IST
జూబ్లీహిల్స్‌ బోగస్‌ ఓట్లపై హైకోర్టులో ముగిసిన విచారణ
X

జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో బోగస్‌ ఓట్ల నమోదుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత లంచ్‌ మోషన్‌ పిటిషన్లు దాఖలు చేశారు. హైకోర్టు విచారణలో భాగంగా బోగస్‌ ఓట్లపై విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం సమాధానం ఇచ్చింది. దీనిపై స్పందించిన హైకోర్టు, ఈసీ ఇప్పటికే చర్యలు ప్రారంభించిందని, అందువల్ల ప్రత్యేక ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story