logo
తెలంగాణ

టీచర్ల అప్పీళ్లపై రేపటిలోగా తేల్చాలి.. తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు

High Court Directs TS Govt On Teachers Appeals
X

టీచర్ల అప్పీళ్లపై రేపటిలోగా తేల్చాలి.. తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు

Highlights

Telangana: ఉపాధ్యాయుల అప్పీళ్లను రేపటి వరకు తేల్చాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు.

Telangana: ఉపాధ్యాయుల అప్పీళ్లను రేపటి వరకు తేల్చాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. పని చేస్తున్న జిల్లా నుంచి మరో ప్రాంతానికి కేటాయించడాన్ని సవాల్ చేస్తూ టీచర్లు దాఖలు చేసిన పలు పిటిషన్లపై ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. సీనియారిటీ, భార్యాభర్తలు ఒకే జిల్లాలో పనిచేయడం వంటి పలు అంశాలను పరిగణలోకి తీసుకొని కేటాయింపులను పునఃపరిశీలించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోరారు.

ఉపాధ్యాయుల అప్పీళ్లను జీవోకు అనుగుణంగా పరిశీలిస్తామని పాఠశాల విద్యాశాఖ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. విద్యాశాఖ వివరణను పరిగణనలోకి తీసుకున్న ఉన్నత న్యాయస్థానం రేపటి వరకు అప్పీళ్లను పరిష్కరించే ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. మరికొన్ని పిటిషన్లలో అప్పీళ్లను పరిష్కరించేందుకు జనవరి 10 వరకు హైకోర్టు విద్యాశాఖకు గడువు ఇచ్చింది. టీచర్ల అప్పీళ్లను ప్రభుత్వానికి పంపాలని డీఈవోలను ఆదేశించింది.

Web TitleHigh Court Directs TS Govt On Teachers Appeals
Next Story