Kunamneni Sambasiva Rao: హిడ్మా ఎన్‌కౌంటర్ బూటకం

Arun Chilukuri
Published on: 19 Nov 2025 1:07 PM IST
Kunamneni Sambasiva Rao: హిడ్మా ఎన్‌కౌంటర్ బూటకం
X

Kunamneni Sambasiva Rao: మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్ బూటకమని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఎన్‌కౌంటర్ ఘటననలపై న్యాయవిచారణ జరపించాలని డిమాండ్ చేశారు. మావోయిస్టులతో చర్చలు జరిపి.. శాంతియుత వాతావరణం నెలకొల్పాలన్నారు. హిడ్మాతో పాటు మరికొందరిని పట్టుకొని కాల్చి చంపారని ఆరోపించారు. మావోయిస్టులు తప్పు చేస్తే సమర్ధించమని.. రాజ్యాధికారం చేతిలో ఉన్నా కూడా చట్టపరంగా న్యాయ పరంగా చర్యలు తీసుకోకుండా ఎన్‌కౌంటర్లు చేయడం సరికాదన్నారు. మోడీపాలనలో సురాజ్ లేదు.. దేశ వ్యాప్తంగా జంగిల్ రాజ్ ఆటవిక విధానం విలయతాండవం చేస్తుందని విమర్శించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story