HICC Security: హెచ్‌ఐసీసీ వద్ద నిరంతర నిఘా

HICC Security: సైబరాబాద్‌ పోలీసులతో కలిపి .. 5 వేల మందితో బందోబస్తు ఏర్పాటు

Jyothi
Published on: 3 July 2022 10:46 AM IST
HICC Security In Madhapur Novotel
X

HICC Security: హెచ్‌ఐసీసీ వద్ద నిరంతర నిఘా

HICC Security: ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో మాదాపూర్‌లోని HICC పరిసరాల్లో నిరంతర నిఘా కొనసాగుతోంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న వేదిక వద్ద నాలుగంచెల భద్రతను కల్పించారు. శుక్రవారం నుంచే SPG అధికారులు HICCలో ప్రధాని బసచేసే నోవాటెల్‌ హోటల్‌, మోడీ ప్రసంగించే వేదిక, ఇతర ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకున్నారు. ఎస్పీజీ, కేంద్రబలగాలు, స్థానిక పోలీసులను కలుపుకొని, మొత్తం 5 వేల మందితో భద్రత, బందోబస్తు ఏర్పాటు చేశామని సైబరాబాద్‌ పోలీసులు తెలిపారు.

హైసెక్యూరిటీ మధ్య కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ప్రధాని మోదీలు శనివారం మధ్యాహ్నం HICCకి చేరుకున్నారు. చుట్టుపక్కల 3 కిలోమీటర్ల పరిధి వరకు కేంద్ర, రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ సిబ్బంది నిఘా కొనసాగుతోంది. ముఖ్యంగా 15 బహుళ అంతస్తుల భవనాల పైనుంచి రూఫ్‌ పెట్రోలింగ్‌, సాయుధ బలగాల పహారా కొనసాగుతోంది.

Jyothi

Jyothi

Next Story