హీరో రజనీకాంత్‌ ఆరోగ్యం నిలకడగా ఉంది..అపోలో వైద్యులు

admin
Published on: 27 Dec 2020 9:52 AM IST
హీరో రజనీకాంత్‌ ఆరోగ్యం నిలకడగా ఉంది..అపోలో వైద్యులు
X

హీరో రజనీకాంత్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో వైద్యులు తెలిపారు. రక్తపోటులో హెచ్చుతగ్గుల కారణంగా శుక్రవారం ఆయన ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. రజనీకాంత్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని, కొన్ని వైద్య పరీక్షల నివేదికలు రావాల్సి వుందని, ఇప్పటివరకూ చేసిన పరీక్షల్లో ఎటువంటి ఆందోళన లేదని అపోలో ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. వైద్యపరీక్షల నివేదికలను పరిశీలించిన అనంతరం డిశ్చార్జ్‌పై ఇవాళ ఉదయం నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఆయనకు విశ్రాంతి అవసరమని,దీంతో ఎవరినీ అనుమతించడం లేదని చెప్పారు.

admin

admin

Next Story