BRS MLA Candidates: బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రకటన.. టికెట్‌ దక్కని సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు వీరే..

BRS MLA Candidates: గులాబీ బాస్ కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు.

Arun Chilukuri
Updated on: 21 Aug 2023 4:13 PM IST
Here is the List of Sitting MLAs Denied Ticket
X

BRS MLA Candidates: బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రకటన.. టికెట్‌ దక్కని సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు వీరే..

BRS MLA Candidates: గులాబీ బాస్ కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. ఏడుచోట్ల అభ్యర్థులను మార్చుతున్నట్లు సీఎం పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలా జాబితాను ప్రకటించిన సీఎం కేసీఆర్‌ కొన్ని స్థానాలను పెండింగ్‌లో పెట్టారు. వీటిలో నర్సాపూర్, నాంపల్లి, గోషామహల్‌, జనగాం నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిపై త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. వేములవాడ, స్టేషన్‌ ఘన్‌పూర్‌, కోరుట్ల, కోరుట్ల, ఉప్పల్‌, ఖానాపూర్‌, అసిఫాబాద్‌, కామారెడ్డి, సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను మారుస్తున్నట్లు కేసీఆర్‌ ప్రకటించారు.

టికెట్‌ దక్కని సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు వీరే

ఆసిఫాబాద్ - ఆత్రం సక్కు స్థానంలో కోవా లక్ష్మీకి టికెట్

ఖానాపూర్ - రేఖానాయక్ స్థానంలో భూక్యా జాన్సన్ నాయక్

బోథ్ - రాథోడ్ బాపూరావు స్థానంలో అనిల్ జాదవ్

వేములవాడ - చెన్నమనేని రమేష్ స్థానంలో చెల్మెడ లక్ష్మీనర్శింహారావు

ఉప్పల్ - బేతి సుభాష్ రెడ్డి స్థానంలో బండారి లక్ష్మారెడ్డి

స్టేషన్ ఘన్‌పూర్ - తాటికొండ రాజయ్య స్థానంలో కడియం శ్రీహరి

వైరా - రాములు నాయక్ స్థానంలో మదన్ లాల్

సిట్టింగ్ ల వారసులు వీరే

►కోరుట్ల - విద్యాసాగర్ రావు కొడుకు సంజయ్

►సికింద్రాబాద్ కంటోన్మెంట్ - దివంగత సాయన్న కూతురు లాస్య

Arun Chilukuri

Arun Chilukuri

Next Story