Telangana Elections 2023: తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా ఇదే.. మొత్తం 50 మందితో తొలి జాబితా రిలీజ్‌కు సన్నాహాలు..?

Telangana Elections 2023: ఈ సారి తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది.

Arun Chilukuri
Published on: 12 Aug 2023 6:21 PM IST
Here is Telangana Congress Assembly Candidates List
X

Telangana Elections 2023: తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా ఇదే.. మొత్తం 50 మందితో తొలి జాబితా రిలీజ్‌కు సన్నాహాలు..?

Telangana Elections 2023: ఈ సారి తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. బీఆర్ఎస్ కంటే ముందుగా అభ్యర్థులను ఖరారు చేసి ఎన్నికలకు అభ్యర్ధులను సమాయత్తం చేయాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగానే పావులు కదుపుతోంది. కర్ణాటక ఎన్నికల జోష్‌ను తెలంగాణలోనూ కంటిన్యూ చేయాలని భావిస్తున్న కాంగ్రెస్ అభ్యర్ధుల తొలి జాబితా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

తొలి జాబితాపై కసరత్తు పూర్తి చేసిన రాష్ట్ర నేతలు జాతీయ నాయకత్వానికి పంపినట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ జాబితాకు హైకమాండ్ ఆమోదం తెలిపితే త్వరలోనే అభ్యర్ధులను ప్రకటించే అవకాశం ఉంది. ఎన్నికల ప్రణాళికలో భాగంగా అగ్రనాయకులతో తెలంగాణలో సభలు, సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించిన అధినాకత్వం.. ఆ కార్యక్రమాల్లో అభ్యర్ధులతోనే ఫోకస్ చేయడం ద్వారా ప్రజల్లోని బలంగా వెళ్లాలని వ్యూహరచన చేస్తోంది.

అన్ని పార్టీల కంటే ముందుగానే ఓ జాబితాను విడుదల చేస్తే అసంతృప్తులను బుజ్జగించేందుకు సమయం ఉండటంతో పాటు విస్తృత ప్రచారానికి సమయం దొరుకుతుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ప్రచారంలో దూసుకుపోవడం ద్వారా అధికార బీఆర్ఎస్ చెక్ పెట్టాలని కాంగ్రెస్ అధినాయకత్వం యోచిస్తోంది.

హైకమాండ్‌ ఆమోదంతో సెప్టెంబర్‌లో తొలిజాబితా ?

నర్సంపేట -దొంతి మాధవరెడ్డి, వరంగల్ పశ్చిమ- నాయిని రాజేందర్ రెడ్డి

వరంగల్ తూర్పు - కొండా సురేఖ, ములుగు - సీతక్క

భూపాలపల్లి - గండ్ర సత్యనారాయణ, నల్లగొండ -కోమటిరెడ్డి వెంకటరెడ్డి

హుజూర్ నగర్ - ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, కోదాడ - ఉత్తమ్‌ పద్మావతి

నాగార్జున సాగర్ - జానారెడ్డి, దేవరకొండ - బాలు నాయక్

వనపర్తి- చిన్నారెడ్డి, నాగర్ కర్నూల్ - కుచుకుళ్ళ రాజేష్ రెడ్డి

కొల్లాపూర్ - జూపల్లి కృష్ణారావు, కల్వకుర్తి -వంశీ చంద్‌ రెడ్డి

అచ్చంపేట - వంశీ కృష్ణ, షాద్‌నగర్ - ఈర్లపల్లి శంకర్

కొడంగల్ - రేవంత్ రెడ్డి, అలంపూర్ - సంపత్ కుమార్

సంగారెడ్డి - జగ్గారెడ్డి, ఆందోల్ - దామోదర రాజనర్సింహా

జహీరాబాద్ - గీతారెడ్డి, నర్సాపూర్ - గాలి అనిల్ కుమార్‌

ఆదిలాబాద్ - కంది శ్రీనివాస్ రెడ్డి, నిర్మల్ - శ్రీహరి రావు

మంచిర్యాల - ప్రేమ్ సాగర్ రావు, బెల్లంపల్లి - గడ్డం వినోద్ కుమార్

జుక్కల్ - గంగారాం, నిజామాబాద్ అర్బన్ - మహేష్ కుమార్‌ గౌడ్

కామారెడ్డి - షబ్బీర్ అలీ, బాల్కొండ - సునీల్ రెడ్డి

వికారాబాద్ - గడ్డం ప్రసాద్ కుమార్, ఇబ్రహీం పట్నం - మల్ రెడ్డి రంగారెడ్డి

పరిగి - రామ్మోహన్ రెడ్డి, మధిర - భట్టి విక్రమార్క

భద్రాచలం - పొడెం వీరయ్య, కొత్తగూడెం - పొంగులేటి శ్రీనివాసరెడ్డి

మంథని- శ్రీధర్ బాబు, వేములవాడ- ఆది శ్రీనివాస్

జగిత్యాల- జీవన్ రెడ్డి, హుస్నాబాద్- ప్రవీణ్ రెడ్డి

హుజురాబాద్- బాల్ముర్ వెంకట్, చొప్పదండి - మేడిపల్లి సత్యం

మానకొండూరు- కౌవ్వంపల్లి సత్యనారాయణ, రామగుండం - రాజ్ ఠాకూర్

పెద్దపల్లి - విజయ రమణా రావు, ధర్మపురి - లక్ష్మణ్

కోరుట్ల - జువ్వాడి నర్సింగ్ రావు, ముషీరాబాద్ - అంజన్ కుమార్ యాదవ్

ఇబ్రహీంపట్నం - మల్ రెడ్డి రంగారెడ్డి, మేడ్చల్- కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి(కేఎల్ఆర్)

జూబ్లీహిల్స్ - విష్ణువర్థన్ రెడ్డి, నాంపల్లి - ఫిరోజ్ ఖాన్

ఖైరతాబాద్ - విజయారెడ్డి(పీజేఆర్ కుమార్తె)

సనత్ నగర్ - మర్రి ఆదిత్యారెడ్డి(మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి మనమడు)

సికింద్రాబాద్ - వైఎస్ షర్మిల(మాజీ సీఎం వైఎస్ఆర్ కుమార్తె)

LBనగర్ -మల్‌రెడ్డి రామారెడ్డి, ఉప్పల్ -రాగిడి లక్ష్మారెడ్డి

మేడ్చల్ - తోటకూర జంగయ్య, ఇబ్రహీంపట్నం -మల్‌రెడ్డి రంగారెడ్డి

Arun Chilukuri

Arun Chilukuri

Next Story