Hyderabad: తక్కువ ధరకు వస్తున్నాయని ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద పండ్లు కొంటున్నారా.? ఈ విషయం తెలిస్తే దడుసుకుంటారు..!

Here are the Dangers of Street vendor Fruits
x

Hyderabad: తక్కువ ధరకు వస్తున్నాయని ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద పండ్లు కొంటున్నారా.? ఈ విషయం తెలిస్తే దడుసుకుంటారు..!

Highlights

Hyderabad: కల్తీ ఆహార పదార్థాలు మార్కెట్‌లో రాజ్యమేలుతున్నాయి. తయారీదారులు కనీస నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు.

Hyderabad: కల్తీ ఆహార పదార్థాలు మార్కెట్‌లో రాజ్యమేలుతున్నాయి. తయారీదారులు కనీస నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు. ఆయా ఆహార పదార్థాలపై తయారీ తేదీ, ఎంత కాలంలోగా వినియోగించాలనే వాటిని ముద్రించకుండానే విక్రయిస్తున్నారు. ఆహార కల్తీపై ఇటీవలి కాలంలో అనేక కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు హైదరాబాద్‌లో కొత్తగా సిగ్నల్స్ దగ్గర స్ట్రాబెరీస్ లాంటి పండ్ల అమ్మకాలు జరుగుతున్నాయి. పండ్లు చెడిపోయినా.. కొనుగోలుదారులు చూడకుండా తక్కువ ధరకే వస్తున్నాయని పొరబడి కొనేస్తున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా చారిత్రకంగా, సాంస్కృతికంగా ఎంతో గుర్తింపు దక్కించుకున్న హైదరాబాద్ మహానగరం ఆహారం విషయంలో అభాసుపాలవుతోంది. భాగ్యనగరంలో ఆహార కల్తీకి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఇప్పటికే నేషనల్ క్రైమ్ రికార్డ్స్​ బ్యూరో గణాంకాల ప్రకారం ఆహార కల్తీలో మొదటి స్థానంలో ఉన్న హైదరాబాద్ ఆహార ప్రియులకు శుచి శుభ్రతతో కూడిన ఆహారాన్ని అందించలేక చెడ్డపేరు తెచ్చుకుంటోంది. వీటిల్లో నాణ్యతా ప్రమాణాలు లేకుండా ఆహారం విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు.

హైదరాబాద్​లో కల్తీ పదార్థాలు తయారు చేస్తున్న ముఠాల వ్యాపారాలు వీధివీధినా విస్తరించాయి. తక్కువ ధరలకు వస్తున్నాయని సిటీలోని మెయిన్ సిగ్నల్స్ దగ్గర అమ్మే స్ట్రాబెర్రీ ని చాలామంది కొంటున్నారు. శివారులోని రేకుల షెడ్లలోని బట్టీల్లో నాసిరకం తినుబండారాలు భారీగా తయారవుతున్నాయి. వాటిని ఇష్టమొచ్చిన పేర్లతో ప్యాకింగ్ చేసి సిగ్నల్స్ ప్రాంతాల్లో అమ్ముతున్నారు. తక్కువ ధరకి వస్తున్నాయని చాలామంది వాటిని కొంటున్నారు.

మేడిపండు చూడు మేలిమై ఉండు పొట్ట విప్పి చూడు పురుగులుండు అనే విధంగా సిగ్నల్స్ దగ్గర అమ్మే స్ట్రాబెర్రీ పండ్ల పరిస్థితి ఉంది. చూడడానికి ఎర్రగా కనిపిస్తాయి. కానీ లోపల చూస్తే చెడిపోయి ఉంటాయి. ఫుడ్ కలర్ వేసి స్ట్రాబెర్రీ సిగ్నల్స్ దగ్గర అమ్మకాలు మొదలుపెట్టారు వ్యాపారులు. దీనివల్ల చిన్నపిల్లలు త్వరగా అనారోగ్యం పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదే విషయం చాలామందికి తెలవక కొంటున్నారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, ఎల్వి ప్రసాద్ హాస్పిటల్, ఎం జె రోడ్ సిగ్నల్స్ దగ్గర ఎక్కువగా ఈ స్ట్రాబెర్రీ అమ్మకాలు కనిపిస్తాయి. తక్కువ ధరకి వస్తున్నాయి కదా అని కొంటున్నామంటున్నారు. కనీసం అవి ఎలా ఉన్నాయో కూడా పరిశీలించి చూడటం లేదు. నగరంలో ఆహారం అంటేనే మొత్తం కల్తీ గా మారిపోయింది. చివరికి మనకు ఆరోగ్యం ఇచ్చే పండ్లను కూడా కల్తీ చేస్తున్నారు పండ్ల వ్యాపారులు.


Show Full Article
Print Article
Next Story
More Stories