Nizam College: అబిడ్స్ లో ఉద్రిక్తత.. విద్యార్థుల ఆందోళనతో భారీ ట్రాఫిక్‌ జామ్‌

Nizam College: హైదరాబాద్‌ నిజాం కాలేజీ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 5 Aug 2024 2:00 PM IST
Heavy Traffic Jam In Shamshabad Due To Students Protest
X

Nizam College: అబిడ్స్ లో ఉద్రిక్తత.. విద్యార్థుల ఆందోళనతో భారీ ట్రాఫిక్‌ జామ్‌

Nizam College: హైదరాబాద్‌ నిజాం కాలేజీ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. గర్ల్స్‌ హాస్టల్‌లో యూజీ విద్యార్థినులకు మాత్రమే అడ్మిషన్లు ఇవ్వాలంటూ స్టూడెంట్స్‌ ఆందోళనకు దిగారు. బషీర్‌బాగ్‌ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించారు. ప్రిన్సిపాల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థినుల ధర్నాతో లిబర్టీ నుంచి అబిడ్స్‌ వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది.

2022లో నిజాం కాలేజీలో యూజీ విద్యార్థినులకు గర్ల్స్‌ హాస్టల్‌ నిర్మించారని, ఆ ఏడాది హాస్టల్‌లో యూజీ విద్యార్థుల అడ్మిషన్లు తక్కువగా ఉండటంతో పీజీ విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించారని తెలిపారు. అయితే ఈ ఏడాది యూజీ అడ్మిషన్లు ఎక్కువగా రావడంతో హాస్టల్‌లో అడ్మిషన్‌ దొరక్క బయట ప్రైవేట్ హాస్టల్‌లో ఫీజులు కట్టలేక అవస్థలు పడుతున్నామన్నారు. గర్ల్స్‌ హాస్టల్‌లో యూజీ విద్యార్థినులకు మాత్రమే అడ్మిషన్లు ఇవ్వాలని ఆందోళనకు దిగారు. ప్రిన్సిపాల్‌ బయటకు వచ్చి యూజీ విద్యార్థులకు హాస్టల్‌లో అడ్మిషన్లు ఇస్తామని హామీ ఇవ్వాలని, అప్పటివరకు ఆందోళనలు విరమించేప్రసక్తే లేదని తేల్చిచెబుతున్నారు ఆందోళనకారులు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story