Hyderabad: పెట్రో కొరతతో..బంకుల దగ్గర క్యూ కట్టిన వాహనదారులు

Heavy Traffic Jam In Front Of Petrol Bunk In Hyderabad
x

Hyderabad: పెట్రో కొరతతో..బంకుల దగ్గర క్యూ కట్టిన వాహనదారులు

Highlights

Hyderabad: పోలీసులు నియంత్రిస్తున్నా అదుపులోకి రాని ట్రాఫిక్‌

Hyderabad: పెట్రోల్, డీజిల్ కొరత హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్‌పై ప్రభావం చూపుతోంది. నగరంలోని బంకులకు వాహనదారులు పోటెత్తడంతో రోడ్లపై వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. నో స్టాక్ బోర్డులు పెట్టడంతో పెట్రోల్ కోసం వచ్చిన వాహనదారులంతా బంకుల ముందే పడిగాపులు కాస్తున్నారు. బంకుల ముందు క్యూ లైన్లు రోడ్లమీదకి చేరడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

పెట్రో కొరత ఉందన్న వార్తలతో జనమంతా బంకులకు పోటెత్తారు. ఆఫీస్ ముగిసే సమయం కావడంతో ఉద్యోగులంతా బంకులకు చేరుకున్నారు. దీంతో పలుచోట్ల ట్రాఫిక్ నిలిచిపోయింది. మాదాపూర్, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. మాదాపూర్ మెట్రో స్టేషన్ నుంచి జూబ్లీ చెక్‌పోస్టు వరకు వాహనాలు నిలిచిపోయాయి. నాంపల్లి, నారాయణగూడ, బషీర్ బాగ్, హైదర్‌గూడ..లక్డీకపూల్‌, అబిడ్స్‌లోనూ వాహనాలు నిలిచిపోయాయి.

వాహనాలు నిలిచిపోవడంతో బంకుల దగ్గర ట్రాఫిక్ క్లియర్‌ చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. వాహనాలను అక్కడ నుంచి పంపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అయినా ట్రాఫిక్ అదుపులోకి రావడం లేదు. మరోవైపు బంకుల్లో స్టాక్ లేదని ఎంట్రీ కూడా బంద్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories