Lockdown in Telangana: వైన్ షాపుల వద్ద భారీ క్యూ
Lockdown in Telangana: బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ అమలులోకి రానుంది.
Lockdown in Telangana: వైన్ షాపుల వద్ద భారీ క్యూ
Lockdown in Telangana: బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ అమలులోకి రానుంది. ఈ సమయంలో వైన్ షాపులు కూడా మూతపడతాయని భావించిని వినియోగదారులు.. వైన్ షాపుల వద్ద ఎగబడతున్నారు. నగరంలోని అన్ని మద్యం దుకాణాల వద్ద భారీ సంఖ్యలో జనాలు క్యూ కట్టారు. హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా ఏ వైన్ షాపు ముందు చూసినా మందుబాబుల రద్దీ కనిపించింది.
హైదరాబాదులోని వైన్ షాపుల వద్ద భారీ క్యూలు దర్శనమిచ్చాయి. కొన్నిచోట్ల ఈ క్యూలు కిలోమీటర్ల మేర ఉన్నాయంటే మందుబాబుల ముందుజాగ్రత్త ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. చాలామంది కేసుల కొద్దీ మద్యం, బీర్లు కొనుగోలు చేసి తీసుకువెళుతున్నారు. అయితే, మద్యం దుకాణాల వద్ద భౌతికదూరం నిబంధన అమలు కాకపోవడం ఆందోళన కలిగించే అంశం.
Next Story




