Warangal: వరంగల్‌ జిల్లాలో ఉదయం నుంచి భారీ వర్షం

Warangal: వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం * పలు కాలనీల్లో ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు

Sandeep Eggoju
Updated on: 11 July 2021 6:52 PM IST
Heavy Rains in Warangal District
X

వరంగల్ జిల్లాలో భారీ వర్షం (ఫొట ది హన్స్ ఇండియా)

Warangal: వరంగల్‌ జిల్లాలో భారీ వర్షం కురుస్తుంది. ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలు కాలనీల్లో వర్షం నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. చివరికి వంట చేసుకోలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు భారీ వర్షానికి నగరంలోని రోడ్లు దెబ్బతిన్నాయి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి మొత్తం వర్షపు నీటితో నిండిపోయింది. పాలకుల నిర్లక్ష్యంతోనే వరంగల్ నగరం చిన్నపాటి వర్షానికి చెరువులా కనిపిస్తుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడికక్కడ గుంతలు తీసి వదిలేశారని మండిపడుతున్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story