తెలంగాణలో ఇవాళ, రేపు భారీ వర్షాలు

Heavy Rains in Telangana Today and Tomorrow
x

తెలంగాణలో ఇవాళ, రేపు భారీ వర్షాలు

Highlights

TS Rains: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం

TS Rains: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పశ్చిమ, నైరుతి దిశ నుంచి రాష్ట్రంలోకి గాలులు వీస్తున్నాయని ఈ ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం చెప్పింది. ఉత్తర - దక్షిణ ద్రోణి తూర్పు విదర్భ నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకు విస్తరించి ఉందని.. అదేవిధంగా ఈ ద్రోణి సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని వాతావరణ కేంద్రం పేర్కొంది.

హైదరాబాద్‌లో ఇవాళ తెల్లవారుజామున కూడా పలు ప్రాంతాల్లో వర్షం పడింది. నాగోల్, బండ్లగూడ, తట్టి అన్నారం, ఎల్బీనగర్‌, దిల్‌సుఖ్‌ నగర్‌, మలక్‌పేట, కోఠి, ఉప్పల్‌ తో పాటు పలు చోట్ల వర్షం కురిసింది. హైదరాబాద్ వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై ఉంది. ఇవాళ మధ్యాహ్నం, సాయంత్రం కూడా వర్షాలు ఓ మోస్తరు పడే అవకాశం ఉంది.

ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, కరీంనగర్, రాజన్న, పెద్దపల్లి, వరంగల్, నల్గొండ, సిద్దిపేట, జనగామ, యాదాద్రి, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్, మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి తదితర జిల్లాల్లో వర్షపాతం అధికంగా నమోదయ్యే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. నిన్న మహబూబ్‌నగర్ జిల్లా చిన్న చింతకుంటలో అత్యధికంగా 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories