Rain Alert: తెలంగాణలో భారీ వర్షాలు

Rain Alert: పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 3 Sept 2024 4:45 PM IST
Low pressure in Bengal basin.. Heavy rain forecast for Telugu states today
X

Rain Update Today: బంగాళా ఖాతంలో అల్పపీడనం..నేడు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

Rain Alert: తెలంగాణలోని పలు జిల్లాల్లో రెండు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని.. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. మధ్య విదర్భ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైన అల్పపీడనం ప్రస్తుతం బలహీనపడి పశ్చిమ విదర్భ పరిసర ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీనికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటును సముద్ర మట్టం నుంచి 3కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవరించి ఉందని చెప్పారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story