Heavy Rains: రాజన్న సిరిసిల్ల జిల్లాలో దంచికొడుతున్న వానలు

Heavy Rains: చెరువులను తలపిస్తున్న లోతట్టు ప్రాంతాలు

Sandeep Eggoju
Published on: 5 Sept 2021 12:54 PM IST
Heavy Rains in Rajanna Sircilla District
X

రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాలు (ఫైల్ ఇమేజ్)

Heavy Rains: రాజన్న సిరిసిల్ల జిల్లాలో వానలు దంచికొడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. రహదారులు వాగులను మరిపిస్తున్నాయి. కొత్త చెరువు మత్తడి పోస్తుండడంతో కరీంనగర్ - సిరిసిల్ల రహదారిపై వరద నీరు ఉప్పొంగుతుంది. రోడ్డుపై వెళ్లేందుకు పాదాచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల్లోని పలు ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. మరికొన్ని కాలనీలను వరదలు ముంచెత్తడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ప్రజలు రెండు రోజులుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story