Heavy Rains: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షం

Heavy Rains: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొణిజర్ల, వైరా, ఏన్కూర్ మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.

Sandeep Eggoju
Published on: 2 July 2021 2:11 PM IST
Heavy Rains in Khammam District
X

ఖమ్మం జిల్లాలో భారీ వర్షం (ఫోటో ది హన్స్ ఇండియా)

Heavy Rains: తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొణిజర్ల, వైరా, ఏన్కూర్ మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. కొన్నిచోట్ల అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుండటంతో కాలనీలన్నీ జలమయమయ్యాయి. దీంతో కొణిజర్ల మండలం తీగల బంజార, అంజనాపురం గ్రామం వద్ద వాగులు పొంగిపొర్లుతున్నాయి. పల్లిపాడు నుంచి ఏన్కూరు వెళ్లే రహదారిపై నీరు భారీగా చేరడంతో రాకపోకలకు ఆటంకం కలిగింది. దీంతో పాటు పది గ్రామాల ప్రజలకు రాకపోకలు నిలిచిపోయాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story