అతలాకుతలం అయిన హైదరాబాద్‌, మరో నాలుగు, ఐదు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు

Heavy Rains in Hyderabad for Coming 4 to 5 Days | Hyderabad Weather Forecast
x

అతలాకుతలం అయిన హైదరాబాద్‌

Highlights

Hyderabad Weather Forecast: * తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు * అతలాకుతలం అయిన హైదరాబాద్‌

Hyderabad Weather Forecast: కుంభవృష్టిలా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ ప్రజలు అల్లాడుతున్నారు. నిన్న ఏకధాటిగా పలు ప్రాంతాల్లో భారీ వాన కురిసింది. దాంతో రహదారులు, కాలనీలు జలమయం అయ్యాయి.. పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయి. తీవ్ర ఇబ్బందులు ఎదర్కున్నారు. మరో నాలుగు రోజుల పాటు ఇలాగే అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని.. ప్రజలు అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని వాతావరణశాఖ హెచ్చరించింది.

ఎగువ నుంచి భారీ వరద రావడంతో మూసారాంబాగ్ బ్రిడ్జి నీట మునిగింది. అంబర్ పేట, దిల్‌సుఖ్‌నగర్ మధ్య సాయంత్రం వరకు రాకపోకలు నిలిచిపోయాయి. యాకత్‌పురా లోతట్టు బస్తీ, సైదాబాద్‌లోని పలు కాలనీల్లోని ఇళ్లలోకి వరద చేరింది. అంబర్‌పేటలోని ఆబ్కారీ కార్యాలయంలో అడుగు లోతు నీరు నిలిచింది. హైదరాబాద్ అంతటా ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. మలక్‌పేట, చాదర్‌ఘాట్ మార్గంలోని RUB వద్ద భారీగా నీరు నిలిచి ట్రాఫిక్ నెమ్మదించింది. నగరంతో పాటు సిద్ధిపేట, యాదాద్రి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. భారీ వర్షాలతో హిమాయత్ సాగర్, గండిపేట భారీగా వరద నీరు వచ్చి చేరడంతో నీటిని దిగువకు వదిలారు. దీంతో మూసీ మరింత ఉధృతంగా ప్రవహిస్తోంది. పరివాహకంలోని లోతట్టు ప్రాంతా వాసులను అధికారులు అప్రమత్తం చేశారు. రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories