Hyderabad Rains: హైదరాబాద్ లో ఇవాళ, రేపు భారీ వర్షాలు

Hyderabad Rains: రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని ఐఎండీ హెచ్చరించింది

Jyothi
Published on: 20 Sept 2022 7:36 AM IST
Heavy Rains In Hyderabad
X

Hyderabad Rains: హైదరాబాద్ లో ఇవాళ, రేపు భారీ వర్షాలు

Hyderabad Rains: హైదరాబాద్ లో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో హైదరాబాద్ లో ఇవాళ, రేపు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ మేరకు హైద‌రాబాద్ న‌గ‌రానికి ఎల్లో అల‌ర్ట్ జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని ఐఎండీ హెచ్చరించింది. ఇక బుధవారం వ‌ర‌కు 0.10 మి.మీ. నుంచి 2.40 మి.మీ. వ‌ర్షపాతం న‌మోద‌య్యే అవ‌కాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా నగరంలోని చాంద్రాయ‌ణ‌గుట్ట‌, రాజేంద్రన‌గ‌ర్, మ‌ల‌క్‌పేట‌, ఎల్బీన‌గ‌ర్, చార్మినార్, బండ్లగూడ‌, యూసుఫ్‌గూడ ఏరియాల్లో 2.50 మి.మీ. నుంచి 15.50 మి.మీ. వ‌ర్షపాతం న‌మోద‌య్యే అవ‌కాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Jyothi

Jyothi

Next Story