Hyderabad: హైదరాబాద్‎లో మరోసారి వర్షం

Hyderabad: కుండపోతవర్షం హైదరాబాద్‌ను ముంచెత్తింది

Jyothi
Published on: 1 Aug 2022 10:09 AM IST
Heavy Rains In Hyderabad | TS News
X

Hyderabad: హైదరాబాద్‎లో మరోసారి వర్షం 

Hyderabad: హైదరాబాద్‎లో మరోసారి వర్షం దంచికొట్టింది. ముఖ్యంగా ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్ పేట్, లకిడీకాపూల్ ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో రోడ్డుపైనే నీరు నిలిచిపోయింది. ముషీరాబాద్, చిక్కడపల్లి, రాంనగర్, కవాడిగూడ, దోమల్ గూడ, భోలక్ పూర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, జవహర్ నగర్, గాంధీనగర్, షేక్ పేట, రాయదుర్గం, రాజేంద్రనగర్, కిస్మత్ పురా, బండ్లగూడ జాగీర్, గండిపేట, పుప్పాలగూడ, మణికొండ, అత్తాపూర్ ప్రాంతాల్లోనూ వర్షం పడింది. దీంతో నగరంలోని రోడ్లన్నీ పూర్తిగా జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ కు తీవ్రఅంతరాయం ఏర్పడింది. గత కొన్ని రోజుల నుంచి కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. ఇవాళ కురిసిన భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Jyothi

Jyothi

Next Story