Hyderabad Rains: హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం

Heavy Rains In Hyderabad
x

Hyderabad Rains: హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం

Highlights

Hyderabad Rains: భారీ వర్షం హెచ్చరికలతో అప్రమత్తమైన అధికారులు

Hyderabad Rains: హైదరాబాద్‌లో అరగంట పాటు కురిసిన కుంభవృష్టికి భాగ్యనగరం రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో.. పలుచోట్ల భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. ఫ్లైఓవర్లపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఖైరతాబాద్‌-పంజాగుట్ట రూట్‌తో పాటు.. బేగంపేట-సికింద్రాబాద్ రూట్‌లో వాహనాలు నిలిచిపోయాయి. భారీ వర్షం హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు..

తెలంగాణలో రానున్న మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. దీంతో రెడ్ అలర్ట్‌ ప్రకటించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories