భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షం

Bhadradri: సీతారాంపురం గ్రామంలో వాగు ఉధృతి

Jyothi
Published on: 27 July 2022 10:20 AM IST
Heavy Rains in Bhadradri Kothagudem
X

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షం

Bhadradri: భారీ వర్షానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మిదేవిపల్లి మండలంలోని వాగులు పొంగిపొర్లుతున్నాయి. సీతారాంపురం గిరిజన గ్రామ సమీపంలోని వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఏడు గ్రామాలలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రాణాలు తెగించి వాగు దాటుతున్నారు గ్రామస్తులు. ప్రమాదకర స్థాయిలో వాగు పొంగుతున్న ట్రాక్టర్లపై రాకపోకలు సాగిస్తున్నారు. ప్రతి ఏడాది వర్షాకాలం వచ్చిందంటే ఇదే పరిస్థితి ఉంటుందని ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి వంతెన నిర్మించడానకి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Jyothi

Jyothi

Next Story