Rains: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం

Rains: జిల్లా కేంద్రంలో చెరువులను తలపిస్తున్న రోడ్లు * పాత బస్టాండ్ నుంచి మినీ ట్యాంక్ బండ్ వరకు జలమయం

Sandeep Eggoju
Published on: 30 Aug 2021 12:15 PM IST
Heavy Rains From Two Days in Rajanna Sircilla District
X

రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాలు (ఫైల్ ఇమేజ్)

Rains: రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ప్రధాన రహదారులను వర్షపు నీరు ముంచెత్తింది. భారీ వర్షం కురుస్తుండటంతో కాలనీలలోకి వరద నీరు ప్రవహిస్తూ చెరువులను తలపిస్తున్నాయి. మరోవైపు పాత బస్టాండ్ మొదలుకొని మినీ ట్యాంక్ బండ్ వరకు వర్షపు నీరు రోడ్లపై ప్రవహిస్తున్నాయి. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందుల పడుతున్నారు. పట్టణంలోని అశోక్ నగర్, డాక్టర్ స్ట్రీట్, శాంతినగర్ ప్రాంతమంతా నీటమునిగి, రోడ్లన్నీ జలమయమయ్యాయి. ప్రజలు ఇళ్ళ నుండి బయటికి రావడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story