Top
logo

Weather Alert: ఇవాళ, రేపు తెలంగాణలో అక్కడక్కడా భారీ వర్షాలు

Alert to Telangana Due to Low Pressure in Bay of Bengal
X

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం (ఫోటో ది హన్స్ ఇండియా )

Highlights

* బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం

Weather Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రమై ఇవాళ వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఇది ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల మీదుగా వెళ్లే అవకాశాలున్నాయన్నారు. 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు గాలులతో ఉపరితల ఆవర్తనం ఉందని పశ్చిమభారతం నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయన్నారు. వీటి ప్రభావంతో సోమ, మంగళవారాల్లో తెలంగాణలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆదివారం 8 నుంచి ఆదివారం రాత్రి 8 గంటల వరకూ పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.

Web TitleHeavy Rains for two days Due to Low Pressure in Bay of Bengal
Next Story