TS Rains: రాబోయే మూడు రోజులు తెలంగాణకు వర్ష సూచన

TS Rains: నేడు భారీ, రేపు అతి భారీ వర్షాలు

Jyothi
Published on: 7 Sept 2022 7:23 AM IST
Heavy Rains for Next Three Days
X

TS Rains: రాబోయే మూడు రోజులు తెలంగాణకు వర్ష సూచన

TS Rains: తెలంగాణలో ఈ నెల 10వ తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. రెండు రోజుల క్రితం ఏర్పడిన ఉత్తర- దక్షిణ ద్రోణి ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఏపీ మీదుగా దక్షిణ ఇంటీరియర్‌ కర్ణాటక పరిసర ప్రాంతాల వరకు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల వద్ద కొనసాగుతున్నదని పేర్కొంది. దీని ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు, మెరుపుల‌తో పాటు బ‌ల‌మైన ఈదురు గాలులు వీచే అవ‌కాశం ఉందని పేర్కొన్న వాతావరణ శాఖ.. ప‌లు జిల్లాల‌కు ఎల్లో, ఆరెంజ్ అల‌ర్ట్‌ల‌ను జారీ చేసింది. బుధవారం, శ‌నివారం రోజుల్లో ఎల్లో అలెర్ట్ జారీ చేయగా.. గురువారం, శుక్రవారాల్లో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు.. ఇక, గురువారం రోజు హైద‌రాబాద్‌కు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం.

Jyothi

Jyothi

Next Story