Rain Update: నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు..ఆ 6 జిల్లాలకు ఎల్లో అలర్ట్

Dhivi
Published on: 24 May 2025 7:32 AM IST
Heavy rains for four days Yellow alert for those 6 districts
X

 Rain Update: నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు..ఆ 6 జిల్లాలకు ఎల్లో అలర్ట్

Rain Update: అరేబియా మహాసముద్రంలో కొనసాగుతున్న అల్పపీడనం ఈనెల 27వ తేదీన పశ్చిమ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుండటంతో తెలంగాణలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ లోని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, ములుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది. అటు ఏపీలోనూ రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

అరేబియా మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు. వాయుగుండం తీవ్ర వాయుగుండంగా లేదా తుఫాన్ గా బలపడే అవకాశం ఉందని చెప్పారు. క్రిష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ లో అత్యధికంగా 12.51 సెంటిమీటర్ల వర్షం కురిసినట్లు తెలిపింది.

Dhivi

Dhivi

Next Story