Heavy Rains: హైదరాబాద్ శివారు, మెదక్‌ జిల్లాలో భారీ వర్షం

Heavy Rains: మహానగరం హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది.

Arun Chilukuri
Published on: 11 Sept 2025 3:43 PM IST
Heavy Rains: హైదరాబాద్ శివారు, మెదక్‌ జిల్లాలో భారీ వర్షం
X

Heavy Rains: హైదరాబాద్ శివారు, మెదక్‌ జిల్లాలో భారీ వర్షం

Heavy Rains: మహానగరం హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. నిమిషాల వ్యవధిలోనే రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై మోకాళ్ల లోతు నీరు నిలవడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ముఖ్యంగా ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్ మెట్, రామోజీ ఫిల్మ్‌సిటీ పరిసర ప్రాంతాల్లో గంటన్నరపాటు భారీ వర్షం నమోదైంది.

మెదక్‌లో రికార్డుస్థాయి వర్షపాతం:

మరోవైపు, మెదక్ జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా కేంద్రంలో కేవలం మూడున్నర గంటల వ్యవధిలో 13 సెం.మీ. రికార్డుస్థాయి వర్షపాతం నమోదైంది. రాజీపల్లిలో 9.2 సెం.మీ, పాతూర్‌లో 8 సెం.మీ వర్షం కురిసింది. మెదక్ పట్టణంలోని రోడ్లన్నీ చెరువులను తలపిస్తుండగా, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. గాంధీనగర్ కాలనీలో ఇళ్లలోకి వరద నీరు చేరింది.

మెదక్-హైదరాబాద్ హైవేపై భారీగా వరద నీరు చేరడంతో అధికారులు జేసీబీ సహాయంతో డివైడర్‌ను తొలగించి నీటిని బయటకు పంపించారు. వర్షాల కారణంగా సాధారణ జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story