Telangana Rains: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు

Heavy Rains Across Telangana
x

Hyderabad Rains: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు

Highlights

Telangana Rains: ఈశాన్య బంగాళాఖాతంలో ఆవర్తన ప్రభావంతో వర్షాలు

Telangana Rains: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా శనివారం అర్ధరాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ పాటు పలు జిల్లాల్లో తెల్లవారుజాము నుంచే వర్షం కురుస్తోంది. వాతావరణ శాఖ ఇప్పటికే పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్‌లో తెల్లవారుజాము నుంచి కుండపోత వాన కురుస్తోంది. హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్, అమీర్‌పేట్, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, పంజాగుట్ట, సన్‌సిటీ టోలిచౌకి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాసబ్ ట్యాంక్‌లో భారీ వర్షం కురుస్తోంది.

వానలు పడక, ఎండల తీవ్రతతో ఇన్నాళ్లు ఇబ్బందులు పడ్డ రాష్ట్ర ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో తెలంగాణలో ఆదివారం నుంచి మంగళవారం వరకు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్ అధికారులను అలర్ట్ చేశారు. నగరంలో వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా చూడాలని అధికారులకు సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అత్యవసర సేవల కోసం జీహెచ్‌ఎంసీ కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదు చేయాలని కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories