Yadagirigutta: చెరువును తలపిస్తున్న యాదాద్రి బాలాలయం

Yadagirigutta: తొలకరి పులకరించింది. అనుకున్న సమయానికే నైరుతి రుతుపవనాలు రావడంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం కురుస్తుంది.

Arun Chilukuri
Published on: 3 Jun 2021 2:02 PM IST
Heavy Rain Lashes in Yadagirigutta
X

Yadagirigutta: చెరువును తలపిస్తున్న యాదాద్రి బాలాలయం

Yadagirigutta: తొలకరి పులకరించింది. అనుకున్న సమయానికే నైరుతి రుతుపవనాలు రావడంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం కురుస్తుంది. యాదగిరిగుట్టలో ఉదయం నుండి ఏకధాటిగా వర్షం కురుస్తోంది. దాంతో శ్రీలక్ష్మీనరసింహస్వామి బాలాలయంలోకి వర్షపు నీరు చేరింది. వాన నీటితో యాదాద్రి బాలాలయం చెరువును తలపిస్తోంది. అర్చకులు వర్షపు నీటిలో కూర్చుని పూజలు నిర్వహిస్తున్నారు. యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మిస్తుండటంతో తాత్కాలికంగా బాలాలయంలోనే నిత్య పూజలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. భారీ వర్షం పడటంతో బాలాలయం మునిగిపోయింది. అయినా పూజాదికాలకు ఎలాంటి ఆటంకం లేకుండా నీటిలో కూర్చోనే నిత్య పూజలు నిర్వహించారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story