వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో భారీ వర్షం.. తెగిన కొడంగల్ పెద్ద చెరువు కాలువ

Vikarabad: కొడంగల్ బాలాజీ నగర్‌లో నీట మునిగిన పలు ఇళ్లు

Jyothi
Updated on: 6 Oct 2022 1:56 PM IST
Heavy Rain In Vikarabad District
X

వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో భారీ వర్షం.. తెగిన కొడంగల్ పెద్ద చెరువు కాలువ

Vikarabad: వికారాబాద్ జిల్లా కోడంగల్‌లో అర్ధరాత్రి భారీ వర్షం పడింది. వరద ఉధృతికి కొడంగల్ పెద్ద చెరువు కాలువ తెగింది. దీంతో కొడంగల్ బాలాజీ నగర్‌లో పలు ఇళ్లు నీట మునిగాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో వస్తువులు, నిత్యావసర సరుకులు తడిసిముద్దయ్యాయి. కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు మున్సిపల్ అధికారులు, సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. 25 ఏళ్ళ క్రితం ఇలాగే వరద వచ్చిందని స్థానికులు చెబుతున్నారు.

Jyothi

Jyothi

Next Story