Weather Report: తెలంగాణకు భారీ వర్ష సూచన

Heavy Rain  In Telangana | TS News
x

Weather Report: తెలంగాణకు భారీ వర్ష సూచన

Highlights

Weather Report: దీని ప్రభావంతో తెలంగాణ లో మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది

Weather Report: తెలంగాణకు భారీ వర్ష సూచనల అందుతోంది. ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాయుగుండం వాయవ్య దిశగా ప్రయాణించి వాయవ్య ఛత్తీస్‌గఢ్‌, తూర్పు మధ్యప్రదేశ్‌లో కొనసాగినట్టు వాతావారణ కేంద్రం వెల్లడించింది. ఈ వాయుగుండం పశ్చిమ, వాయవ్య దిశగా కదిలి బలహీనపడే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో తెలంగాణ లో మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నెల 19వరకు రాష్ట్రంలో ఇవే పరిస్థితులుంటాయని పేర్కొంది. ఇక గడిచిన 24 గంటల్లో ఆసిఫాబాద్‌ జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories