Telangana Rains: తెలంగాణలో నేడు భారీ వర్షం..రేపటి నుంచి అతి భారీ వర్షాలు

Telangana Rains: తెలంగాణలో బుధవారం భారీ వర్షం, గురువారం నుంచి మూడు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది.

Dhivi
Published on: 17 July 2024 6:56 AM IST
Heavy rain in Telangana today..Heavy rains from tomorrow
X

Telangana Rains: తెలంగాణలో నేడు భారీ వర్షం..రేపటి నుంచి అతి భారీ వర్షాలు

Telangana Rains:రాష్ట్రంలో నేడు భారీ వర్షం, రేపటి నుంచి మూడు రోజులు పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికలు కూడా జారీ చేసింది. ముఖ్యంగా తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ జిల్లాల్లో 11.5 నుంచి 20 సెం. మీ వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈదురు గాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగి పడటం, విద్యుత్ సరఫరా స్తంభించడం, లోతట్టు ప్రాంతాల్లో వరద ముంపు ఏర్పడటం వంటివి జరగవచ్చని తెలిపింది.

-గురువారం కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సూర్యపేట, వరంగల్, నల్లగొండ, హన్మకొండ, జనగామ, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

-శుక్రవారం ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదు అవుతాయి. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, నల్లగొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్ధిపేట, యాద్రాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

-శనివారం నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ, జనగామ, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది.

Dhivi

Dhivi

Next Story