Weather Update: తెలంగాణలో భారీ వర్షాలు.. వడగండ్లతో నిండిపోయిన రోడ్లు..

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.

Arun Chilukuri
Published on: 16 March 2023 3:55 PM IST
Heavy Rain in Telangana
X

Weather Update: తెలంగాణలో భారీ వర్షాలు.. వడగండ్లతో నిండిపోయిన రోడ్లు..

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తెలంగాణలో పలుచోట్ల వర్షాలు పడుతుంటే.. కొన్ని చోట్ల వడగండ్లు పడ్డాయి. ఉపరితల ద్రోణి ప్రభావంతో పగలే మబ్బులు కమ్మేశాయి. మిట్టమధ్యాహ‌్నం వేళ లైట్లు వేసుకుని వాహనాలు నడిపే పరిస్థితి ఏర్పడింది.

తెలంగాణలో హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లా్ల్లో వర్షం బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా మేఘాలు కమ్మేసి..ఉరుములు, మెరుపులతో భారీ ఎత్తున వర్షాలు కురిశాయి. హైదరాబాద్‌లోని నాగోల్, ఎల్బీనగర్, వనస్థలిపురం, దిల్‌సుఖ్‌నగర్‌, మలక్‌పేట, రాజేంద్రనగర్‌ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

ఇక సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో వడగండ్ల వాన కురిసింది. వికారాబాద్ జిల్లాలో వడగండ్ల వానతో రోడ్లు మంచు కురిసినట్లు మారిపోయాయి. సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం దంచికొట్టింది. మధ్యాహ్నం నుంచి వాతావరణం మారిపోయి భారీ ఈదురుగాలులతో వర్షం కురిసింది. పశ్చిమబెంగాల్‌ నుంచి జార్ఖండ్‌ మీదుగా కొనసాగుతున్న ఉపరితల ద్రోణి కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తుండగా.. మరో నాలుగు రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story