Suryapet: సూర్యాపేటలో కురిసిన భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం

Suryapet: జలదిగ్బంధంలో చిక్కుకున్న ప్రజలు.. ఇబ్బందుల్లో 60 ఫీట్ల రోడ్ కాలనీ ప్రాంతవాసులు

Jyothi
Published on: 29 Sept 2022 1:32 PM IST
Heavy Rain In Suryapet | TS News
X

Suryapet: సూర్యాపేటలో కురిసిన భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం

Suryapet: సూర్యాపేట జిల్లా కేంద్రంలో రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో జిల్లా కేంద్రంలోని విద్యానగర్ లోని పలు లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.. కాలనీలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అర్ధరాత్రి తర్వాత భారీ వర్షం కురవడంతో పలు ఇళ్లల్లోకి నీరు చేరి, వంట సామగ్రితోపాటు ఇంట్లోని సామాన్లన్నీ పూర్తిగా నీటిలో మునిగిపోయాయి.. వర్షం కురవడం వల్ల చాలా ఇబ్బందులు పడ్డామని, బయటకి రావాలంటే అనేక కష్టాలు పడుతున్నామని బాధితులు తెలిపారు. సూర్యాపేట ఎగువ ప్రాంతంలో వర్షం కురవడంతో 60 ఫీట్ల రోడ్ లోని నాలా ఉధృతంగా ప్రవహించడంతో కాలనీలో వరద చేరిందన్నారు. తమ కాలనీ నీట మునిగినా ఏ ఒక్క అధికారీ పట్టించుకోవడం లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.

hmtv బతుకమ్మ పాట 2022 కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Jyothi

Jyothi

Next Story