Karimnagar: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా వడగళ్ల వాన

Karimnagar: పలు ప్రాంతాల్లో పంట నష్టం

Jyothi
Published on: 19 March 2023 8:31 AM IST
Heavy Rain In Karimnagar
X

Karimnagar: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా వడగళ్ల వాన 

Karimnagar: ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. పెద్ద సైజులో ఉన్న వడగళ్ళు ఒక్కసారిగా ఆకాశం నుండి కుప్పలు తెప్పలుగా పడుతుండటంతో వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు పట్టణవాసులు. మరోవైపు ఇవే వర్షాలు పల్లె ప్రాంతాల్లో రైతులకు ఆందోళన కలిగిస్తున్నాయి.

భారీ వర్షాలతో ఇప్పటికే పలు చోట్ల మొక్క జొన్న పంట నెలకొరగడంతో నష్టపోయారు రైతులు. కరీంనగర్ రూరల్ ,కొత్తపల్లి ,గంగధార,ధర్మారం,చొప్పదండి ,మానకొండూర్ మండలాల్లో అత్యదికంగా పంట నష్టపోయినట్టుగా గుర్తించారు అధికారులు. మరో రెండు రోజుల పాటు ఇలానే ఉరుములు మెరుపులతో కూడిన వడగళ్ళ వర్షాలు కురుస్తాయని సూచించారు వాతావరణ శాఖ అధికారులు.

Jyothi

Jyothi

Next Story