Hyderabad: హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు..

Hyderabad: హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు..

Jyothi
Published on: 17 March 2023 9:02 AM IST
Heavy Rain in Hyderabad
X

Hyderabad: హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు..

Hyderabad: గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈ వర్షాలతో నగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. కొన్ని చోట్ల ఆకాశంలో మెరుపులు.. మేఘాల గర్జనలకు జనం భయపడ్డారు. గచ్చిబౌలి, యూసుఫ్‌గూడ, సోమాజీగూడ, అమీర్‌పేట, కూకట్‌పల్లి, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, కాటేదాన్‌, రాజేంద్రనగర్‌, హయత్‌నగర్‌, పెద్ద అంబర్‌పేట తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు కురవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పశ్చిమ బెంగాల్‌ నుంచి ఝార్ఖండ్‌ మీదుగా ఒడిశా వరకు ద్రోణి ఏర్పడటం.. ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకణ్‌ తీరం వరకూ మరో ద్రోణి ప్రభావంతో బంగాళాఖాతం నుంచి రాష్ట్రం వైపు తేమ గాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ, రేపు చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది.

Jyothi

Jyothi

Next Story