హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం

Hyderabad: మధ్యాహ్నం నుంచి దంచి కొడుతున్న వర్షం

Jyothi
Updated on: 6 Sept 2022 3:46 PM IST
Heavy Rain in Hyderabad
X

హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం 

Hyderabad: హైదరాబాద్‌లో మిట్ట మధ్యాహ్నం.. వాన దంచి కొడుతోంది. కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. జూబ్లీహిల్స్, పంజాగుట్ట, మణికొండ, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్‌ లో వర్షం కురుస్తోంది. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచి ఎండ కొట్టినా.. మధ్యాహ్నం అయ్యే సరికి వాతావరణం పూర్తిగా మారిపోయింది. మేఘావృతమై భారీ వర్షం కురుస్తోంది.

Jyothi

Jyothi

Next Story