Weather Update: ఉరుములు..మెరుపులు..ఈదురు గాలులు..హైదరాబాద్‌లో‌ భారీ వర్షం

Heavy Rains In Hyderabad
x

‌హైదరాబాద్ వర్షాలు ఫైల్ ఫోటో

Highlights

Weather Update: హైదరాబాద్ లో ఆకాల వర్షాలలో ప్రజలు అల్లడిపోతున్నారు.

Weather Update: హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఒకవైపు కరోనా సెకండ్ వేవ్ విజృంభన కొనసాగుతుంటే..మరోవైపు నగరంలో కూరుస్తున్న భారీ వర్షం ప్రజలను టెన్షన్ గురిచేస్తుంది. హైదరాబాద్‌లో మంగళవారం మధ్యాహ్నం నంచి ఈదురుగాలులతో కూడిన వాన దంచికొడుతుంది. నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం చిన్నగా మొదలై సిటీ అంతటా ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవటంతో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

యూసఫ్ గూడ, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, అమీర్ పేట, కూకట్ పల్లి, ఎర్రగడ్డ, వెంకటగిరి ప్రాంతాల్లో రోడ్లపై వర్షం నీరు చేరింది. డ్రైనేజ్ పొంగిపోర్లడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎండాకాలంలో కురుస్తున్న వర్షాలతో వాతావరణం చల్లబడిందని నగర వాసులు కాస్త ఊపిరి పీల్చుకున్నా.. కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగడంతో భయాందళనకు గురవుతున్నారు. లక్డీకాపూల్‌, పంజాగుట్ట, ఫిల్మ్ నగర్, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, కొండాపూర్, బోరబండ, కొత్తగూడలొ గాలికి హోల్డింగులు విరిగిపడ్డాయి.

ఈదురుగాలులు కూడా తోడవటంతో చెట్లు, ఫ్లెక్సీలు విరిగిపడ్డాయి. పలు చోట్ల రోడ్లపైకి నీరు చేరడంతో ట్రాఫిక్‌ కు అంతరాయం కలుగుతుంది. రోడ్లపైకి నీరు చేరడంతో మున్సిపల్ సిబ్బంది వాటిని తొలిగించేపనిలో పడ్డారు. దీంతో అత్యవసరాల కోసం వెళ్తున్న వాహన చోదకులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కరోనా వ్యాప్తి పెరగడంతోపాటు, డెంగ్యూ, డయేరియా వంటి వ్యాధులు ప్రభలే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

మరోవైపు రాష్ట్రంలో మే 1 వరకు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కర్ఫ్యూ నుంచి ఆస్పత్రులు, ఫార్మసీలు, ల్యాబ్‌లకు మినహాయింపు ఇచ్చారు. రాత్రి 8 గంటలకే కార్యాలయాలు, దుకాణాలు, హోటళ్ల మూసివేతకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories