Top
logo

హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం

హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం
X
Highlights

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో కూడా కుండపోత వర్షం..

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో కూడా కుండపోత వర్షం కురుస్తోంది. శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. నగరం మొత్తం వర్షం కురుస్తుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, నాంపల్లి, కోఠి, ఖైరతాబాద్, అమీర్ పేట్, కూకట్ పల్లి , అబిడ్స్, రాజేంద్రనగర్, మణికొండ, ఎల్బీనగర్, దిల్ సుఖ్ నగర్, ఉప్పల్ లో వర్షానికి జనం అవస్తలు పడుతున్నారు.

హస్తినపురంలో 9.8 సెం.మీ, కందికల్‌ గేట్‌ 7.2 సెం.మీ వర్షపాతం. సరూర్‌నగర్‌లో 6.8 సెం.మీ, చార్మినార్‌ 6.8 సెం.మీ, చాంద్రాయణగుట్ట 6.5 సెం.మీ, మారేడుపల్లి 6.4 సెం.మీ, ఎల్బీనగర్‌ 6.4 సెం.మీ, తార్నాక 5.9 సెం.మీ వర్షపాతం నమోదు అయ్యింది. ఇదిలావుంటే తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షం కురుస్తోంది. కరీంనగర్‌, ఖమ్మం, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.

Web Titleheavy rain hyderabad
Next Story