Top
logo

Hyderabad: హైదరాబాద్‌లో రాత్రి నుంచి కురుస్తున్న వర్షం

Heavy Rain Fall in Hyderabad
X

హైదరాబాద్ లో వర్షం (ఫైల్ ఇమేజ్)

Highlights

Hyderabad: తెలంగాణ వ్యాప్తంగా పలుచోట్ల వర్షం * పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వాన

Hyderabad: హైదరాబాద్‌లో రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. రాత్రంతా వర్షం కారణంగా మహానగరం తడిసి ముద్దయింది. రాత్రి కురిసిన వర్షం కారణంగా నగరంలోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. దీంతో రంగంలోకి దిగిన జీహెచ్‌ఎంసీ అధికారులు నాలలను తెరిసి రోడ్లపై నిలిచిపోయిన నీటిని తొలగించే పనిలో పడ్డారు. రాత్రంతా వర్షం కురుస్తున్న కారణంగా నగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఈ రోజంతా ఆకాశం మేఘావృతమై పలు చోట్ల ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది.

ఇదిలా ఉంటే తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. కుమరంభీం, అసీఫాబాద్‌, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, మహబూబాబాద్, వరంగల్‌ రూరల్‌, వరంగల్ అర్బన్, కామారెడ్డి, మహబూబ్‌ నగర్‌ జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి వర్షం కురిసే అవకాశాలున్నాయని, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు భద్రాది కొత్తగూడెం జిల్లాల్లో శనివారం భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. అలాగే ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్‌, జగిత్యాల, కరీంనగర్‌, పెద్దపల్లిలో ఆదివారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశాలున్నాయి.


Web TitleHeavy Rain Fall in Hyderabad
Next Story