Weather Alert: తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు వర్షసూచన

* రాగల 24గంటల్లో అల్పపీడనం ఏర్పాడే అవకాశం

Sandeep Reddy
Updated on: 10 Sept 2021 9:15 PM IST
Heavy Rain Alert for the Next Three Days to Telangana
X

తెలంగాణకు మరో మూడు రోజులు భారీ వర్ష సూచన (ఫోటో ది హన్స్ ఇండియా)

Weather Alert: తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉపరితల ఆవర్తనం తూర్పు మధ్య బంగాళా‍ఖాతం పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు కేంద్రీకృతమైందని తెలిపింది. ఈ ఆవర్తనం ప్రభావంతో మధ్య బంగాళాఖాతంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పాడే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. ఈ అల్పపీడనం 48 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story