శ్రీశైలం ప్రాజెక్ట్‌కు భారీగా వరద

Srisailam Project: ఒక్కరోజే ప్రాజెక్ట్‌లోకి 29 టీఎంసీలు

Sriveni Erugu
Published on: 19 July 2022 9:04 AM IST
Heavy flood for Srisailam Project
X

శ్రీశైలం ప్రాజెక్ట్‌కు భారీగా వరద

Srisailam Project: శ్రీశైలం ప్రాజెక్ట్‌కు భారీగా వరద చేరుతోంది. నిన్న 3.27 లక్షల క్యూసెక్కుల నీరు రాగా ఒక్క రోజులోనే ప్రాజెక్టులోకి 29 టీఎంసీల నీరు చేరింది. శ్రీశైలం ప్రాజెక్టుకు సోర్స్‌గా ఉన్న జూరాల నుంచి 1.7 లక్షల క్యూసెక్కులు, సుంకేశుల నుంచి 1.65 లక్షల క్యూసెక్కులు విడుదలవుతోంది. దీంతో శ్రీశైలానికి భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 135.94 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మరో మూడు రోజులు వరద ఇలాగే కొనసాగితే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story