High Temperature: నిప్పుల కొలిమిలా తెలంగాణ.. రెడ్ జోన్‌ అంచున 11 జిల్లాలు..

Heatwave Alert in Telangana
x

High Temperature: నిప్పుల కొలిమిలా తెలంగాణ.. రెడ్ జోన్‌ అంచున 11 జిల్లాలు..

Highlights

High Temperature: తెలంగాణ రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి.

High Temperature: తెలంగాణ రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో టెంపరేచర్లు నమోదవుతున్నాయి. ఏప్రిల్ మొదటి వారంలోనే 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డవుతుండటంతో ప్రజలు అల్లాడుతున్నారు. గత సంవత్సరం ఇదే వారంతో పోలిస్తే 2, 3 డిగ్రీల ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదు కావడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో నిన్న అత్యధికంగా నల్గొండ జిల్లా నిడమనూరు, సూర్యాపేట జిల్లా శాంతినగర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గరిమెళ్ల పాడులో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణలో ఎండలు మండిపోతుండటం, మధ్యాహ్నం నుంచి వడగాడ్పులు వీస్తుండటంతో ప్రజలు బయటికి రావాలంటేనే జంకుతున్నారు.

అత్యవసర పనులు ఉంటే తప్ప ప్రజలు మధ్యాహ్నం అడుగుబయట పెట్టడం లేదు. ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఎప్పుడూ రద్దీగా ఉండే రోడ్లు.. మధ్యాహ్నం బోసిపోయి కనిపిస్తున్నాయి. సాయంత్రమైనా వడగాడ్పుల వేడి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సింగరేణి ఏరియాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఓపెన్​కాస్ట్​మైన్స్‌ల్లో కార్మికులు ఉక్కపోతతో ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో ఫస్ట్, సెకండ్​ షిఫ్ట్​ టైమింగ్స్​మార్చాలని కార్మికులు డిమాండ్​చేస్తున్నారు. రాష్ట్రంలోని చాలా గవర్నమెంట్​ హాస్పిటల్స్‌లో ఏసీలు, కూలర్లు లేకపోవడంతో ప్రధానంగా గర్భిణులు, బాలింతలు అవస్థలు పడుతున్నారు.

తెలంగాణలో 11 జిల్లాలు రెడ్ జోన్ అంచున ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెంలో 44.5 డిగ్రీలు, సూర్యాపేటలో 44.5, నల్గొండ 44.5, మహబూబాబాద్ 44.4, ములుగు 44.4, మంచిర్యాల 44.4, కుమ్రంభీం అసిఫాబాద్44.4, వనపర్తి 44.3, ఖమ్మం 44.3, జగిత్యాల 44.1, కరీంనగర్‌లో 44డిగ్రీల టెంపరేచర్ నమోదవువుతోంది. మరో హాఫ్ డిగ్రీ, డిగ్రీ దాటితే ఈ జిల్లాలు వాతావరణ శాఖ లెక్క ప్రకారం రెడ్ జోన్ లోకి వెళ్లే ప్రమాదం ఉంది. అలాగే, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, యాదాద్రి భువనగిరి, జనగాం, జోగులాంబ గద్వాల, నిర్మల్, వరంగల్, హనుమకొండ, నాగర్ కర్నూల్, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లో 43 సెల్సియస్ డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్‌లో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా..మిగతా జిల్లాల్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories