MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ

MLC Kavitha: లిక్కర్ స్కామ్ కేసులో జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న కవిత

Jyothi
Published on: 4 April 2024 10:57 AM IST
Hearing on MLC Kavitha Interim Bail Petition Today
X

MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ

MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ జరగనుంది. లిక్కర్ స్కామ్ కేసులో జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న కవిత.. తన కుమారుడి పరీక్షలు ఉండటంతో బెయిల్‌ కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఇవాళ మరోసారి వాదనలు విననుంది ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు. ఈనెల 1న పిటిషన్‌పై జరిగిన విచారణలో కవిత తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. కవిత పిటిషన్‌పై ఈడీ వివరణ కోరగా... సమయం కోరడంతో ఇవాళ్టికి వాయిదా వేసింది కోర్టు. ఈడీ వాదనల అనంతరం కవిత మధ్యంతర బెయిల్‌పై తీర్పు వెలువరించనుంది కోర్టు.

Jyothi

Jyothi

Next Story