Ktr: సుప్రీంకోర్టులో నేడు కేటీఆర్ పిటిషన్ పై విచారణ

Dhivi
Published on: 15 Jan 2025 7:36 AM IST
Ktr: సుప్రీంకోర్టులో నేడు కేటీఆర్ పిటిషన్ పై విచారణ
X

Ktr: మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఫార్ములా ఈ కారు రేసులో ఈ నెల 8న ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు.

ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ ఈమధ్యే పిటిషన్ దాఖలు చేశారు. దీనికి ఉన్న న్యాయస్థానం నిరాకరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేటీఆర్ పిటిషన్ పై జస్టిస్ బేలా ఎం త్రివేది ప్రసన్న వర్లె ధర్మాసనం విచారణ జరపనుంది. మరోవైపు ఇప్పటికే సుప్రీంకోర్టులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఏసీబీ కేవియట్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

Dhivi

Dhivi

Next Story