బీఎల్ సంతోష్ నోటీసులపై నేడు హైకోర్టులో విచారణ

* బీఎల్ సంతోష్‌కు 41A CRPC నోటీసులపై నేటితో ముగిసిన స్టే

R Tripura Malini
Updated on: 13 Dec 2022 12:51 PM IST
Hearing On BL Santosh Notices Today In High Court
X

బీఎల్ సంతోష్ నోటీసులపై నేడు హైకోర్టులో విచారణ

Telangana: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నేడు హైకోర్టులో కీలక విచారణ జరగనుంది. బీఎల్ సంతోష్ నోటీసులపై నేడు హైకోర్టు విచారణ చేపట్టనుంది. బీఎల్ సంతోష్‌కు 41A CRPC నోటీసులపై నేటితో స్టే ముగిస్తుంది. ఇదే కేసులో జగ్గుస్వామి నోటీసులపై హైకోర్టు స్టే విధించింది. ఈ రెండు పిటిషన్లపై నేడు హైకోర్టు విచారణ చేపట్టనుంది. మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో భాగంగా సీబీఐతో విచారించాలన్న పిటిషన్లపై కూడా ఇవాళ వాదనలు జరగనున్నాయి. సిట్‌ పారదర్శకంగా దర్యాప్తు జరపడం లేదని పిటిషన్‌ దాఖలైంది. ప్రభుత్వం చెప్పినట్లే సిట్‌ చేస్తోందని పిటిషనర్లు చెబుతున్నారు. అయితే దర్యాప్తు సక్రమంగా జరుగుతుందని ప్రభుత్వ లాయర్లు వాదించారు. ఇక ఇదే పిటిషన్‌పై నేడు మరోసారి హైకోర్టులో విచారణ జరగనుంది.

R Tripura Malini

R Tripura Malini

Next Story