Telangana Highcourt: తెలంగాణలో పాఠశాలల ప్రారంభానికి బ్రేక్

Ts Highcourt: విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధనపై హైకోర్టు స్టే * స్కూళ్ల రీఓపెన్‌ నిలిపివేయాలని హైకోర్టులో పిటిషన్‌

Arun Chilukuri
Updated on: 31 Aug 2021 5:51 PM IST
Inquiry In The High Court On The Commencement Of Schools
X

తెలంగాణ హై కోర్టు (ది హన్స్ ఇండియా )

Telangana Highcourt: తెలంగాణలో రేపు జరగాల్సిన పాఠశాలల ప్రారంభానికి బ్రేక్ పడింది. ప్రభుత్వ జీవోపై వారం రోజులపాటు హైకోర్టు స్టే విధించింది. స్కూళ్ల రీఓపెన్‌ నిలిపివేయాలని హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధనపై వారం రోజులపాటు హైకోర్టు స్టే విధించింది. దీంతో వారం రోజులపాటు ఆఫ్‌లైన్‌ క్లాసులకు బ్రేక్‌ పడినట్లయ్యింది.

పేరెంట్స్ నుంచి ఎలాంటి రాతపూర్వక హామీ తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధనపై బలవంతం చేయకూదని హైకోర్టు చెప్పింది. విద్యార్థులు, మేనెజ్‌మంట్‌పై ఎలాంటి ఒత్తిడి చేయకూడదని ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. నాలుగు వారాల్లోగా పూర్తి నివేదిక సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story