Azharuddin: ఇంత పెద్ద మ్యాచ్ జరిగినప్పుడు చిన్నా చితక ఘటనలు జరుగుతాయి

Azharuddin: టికెట్స్ అన్నీ అమ్ముడుపోయాయని తేల్చేసిన అజారుద్దీన్

Rama Rao
Updated on: 22 Sept 2022 5:46 PM IST
HCA President Azharuddin Did not Give Clarity on the Tickets
X

Azharuddin: ఇంత పెద్ద మ్యాచ్ జరిగినప్పుడు చిన్నా చితక ఘటనలు జరుగుతాయి

Azharuddin: భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌ టికెట్ల వ్యవహారంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ది ఓ మాట HCA ప్రెసిడెంట్‌ అజారుద్దీన్‌ది మరో మాటలా ఉంది. జింఖానా గ్రౌండ్‌లో జరిగిన ఘటనపై HCAదే బాధ్యత అని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అంటే ముందస్తుగానే పోలీసులకు లిఖితపూర్వకంగా సమాచారం ఇచ్చామని అజారుద్దీన్ చెప్పడం దుమారం రేగుతోంది. ఇక ఇవాళ కూడా ఆన్‌లైన్‌లో టికెట్ల అమ్మకం ఉంటుందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చెప్తే ఇప్పటికే మొత్తం టికెట్లు అమ్ముడుపోయాయని అజారుద్దీన్ చెప్పడం కలకలం రేపుతోంది. అసలు టికెట్లు ఉన్నాయా..? ఉంటే ఎన్ని ఉన్నాయి అనే దానిపై అటు హెచ్‌సీఏగానీ,.. ఇటు మంత్రి గానీ క్లారిటీ ఇవ్వకపోవడంపై క్రికెట్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

ఇదిలా ఉంటే మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఎదుటే అజారుద్దీన్ నిప్పులు చెరిగాడు. టిక్కెట్ల విషయంలో ఉదయం జింఖానా పరేడ్ గ్రౌండ్స్‌లో ఊహించని రీతిలో తొక్కిసలాట జరిగినా దాన్నంతా లైట్‌గా తీసుకున్నట్లుగా అజారుద్దీన్ మంత్రి ఎదుటే రివర్స్ అయ్యారు. ఇంత పెద్ద మ్యాచ్ జరిగేటప్పుడు చిన్నా చితక ఘటనలు జరగడం కామన్ అన్నట్లుగా అజారుద్దీన్ మాట్లాడడం తీవ్ర దుమారం రేపుతోంది. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఎదుట అజారుద్దీన్ ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం.

Rama Rao

Rama Rao

Next Story