Hyderabad: కారులో రూ.4 కోట్ల హవాలా నగదు లభ్యం

Hyderabad: హైదరాబాద్‌లో హవాలా డబ్బు కలకలం రేపింది.

Arun Chilukuri
Published on: 5 Dec 2025 2:14 PM IST
Hyderabad: కారులో రూ.4 కోట్ల హవాలా నగదు లభ్యం
X

Hyderabad: హైదరాబాద్‌లో హవాలా డబ్బు కలకలం రేపింది. ఓ కేసులో అక్రమంగా హవాలా నగదు తరలిస్తున్నారన్న ముందస్తు సమాచారంతో.. కొంత మందిపై పోలీసులు నిఘా పెట్టారు. వారిని వెంబడించి అక్రమార్కులను బోయిన్‌పల్లి పోలీసులు పట్టుకున్నారు. 4 కోట్ల రూపాయల హవాల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కార్ డిక్కీ, టైర్లలో హవాలా డబ్బును దాచినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు హవాలా ముఠాను అదుపులోకి తీసుకుని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story