Revanth Reddy: కొడంగల్‌ నియోజకవర్గంలో హాత్‌ సే హాత్‌ జోడో అభియాన్‌ యాత్ర ప్రారంభం

Revanth Reddy: ఫిబ్రవరి 6 నుంచి 60రోజుల పాటు హాత్‌ సే హాత్‌ జోడో యాత్ర

Dhatripriya
Published on: 27 Jan 2023 3:51 PM IST
Hath Se Hath Jodo Abhiyaan Yatra started in Kodangal
X

Revanth Reddy: కొడంగల్‌ నియోజకవర్గంలో హాత్‌ సే హాత్‌ జోడో అభియాన్‌ యాత్ర ప్రారంభం

Revanth Reddy: వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ నియోజకవర్గంలో హాత్‌ సే హాత్‌ జోడో అభియాన్‌ను యాత్రను టీ.పీసీసీ అధ్య‍క్షుడు రేవంత్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. బొంరాస్‌పేట్‌ మండలం మదనపల్లిలో హనుమాన్‌ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం యాత్రకు సంబంధించిన కరపత్రాలను రేవంత్‌రెడ్డి విడుదల చేశారు. ఫిబ్రవరి 6 నుంచి 60రోజుల పాటు హాత్‌ సే హాత్‌ జోడో యాత్ర కొనసాగనుంది. ప్రత్యేక పూజల అనంతరం కొడంగల్‌ వెళ్లి గురునాథ్‌రెడ్డిని కలిసి శాలువా కప్పి సన్మానించారు. యాత్ర వివరాలను గురునాథ్‌రెడ్డికి వివరించారు రేవంత్‌రెడ్డి. కాంగ్రెస్‌ నుంచి గెలిచిన వారిని సన్మానించాలని కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున్‌ఖర్గే ఆదేశాల మేరకు గురునాథ్‌రెడ్డిని కలిసినట్లు కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. గురునాథ్‌ రెడ్డిని రేవంత్‌ రెడ్డి కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

Dhatripriya

Dhatripriya

Next Story